Motorola Edge 70 Pro: మోటోరోలా ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి టీజింగ్ మొదలుపెట్టింది. కంపెనీ యొక్క అఫీషియల్ అకౌంట్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి టీజింగ్ చేసింది. ఈ ఫోన్ పేరు ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ ఇది మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ కావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లీక్స్ అండ్ […]
Motorola Edge 70 Pro: మోటోరోలా ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి టీజింగ్ మొదలుపెట్టింది. కంపెనీ యొక్క అఫీషియల్ అకౌంట్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి టీజింగ్ చేసింది. ఈ ఫోన్ పేరు ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ ఇది మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ కావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లీక్స్ అండ్ రూమర్స్ ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. Survey Thank you for completing the survey! Motorola Edge 70 Pro: లీక్స్ అండ్ రూమర్లు మోటరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ 70 ప్రో వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లో విడుదలవుతుందని రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ద్వారా మోటోరోలా తీజ్ చేస్తున్న ఫోన్ కూడా ఇదే అని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో చూపించిన టీజర్ ఇమేజ్ లో ఎడ్జ్ సిరీస్ మాదిరి డిజైన్ కలిగి వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగిన ఫోన్ కనిపిస్తోంది. ఇక నెట్టింట్లో వైరల్ అయిన మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రీమియం లుక్ అండ్ స్లిమ్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ గ్లాస్ మరియు అల్యూమినియం బాడీ సంగమం గా ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ లో 6.7 అంగుళాల OLED డిస్ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. మోటోరోలా ఈ ఫోన్ ను Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని కొన్ని లీక్స్ మరియు రూమర్లు చెబుతున్నాయి. ఇది 4nm చిప్ సెట్ మరియు మంచి పెర్ఫార్మెన్స్ ను ఈ చిప్ సెట్ తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే, కంపెనీ ఈ ఫోన్ చిప్ సెట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. Also Read: లేటెస్ట్ 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.! ఈ ఫోన్ లో కెమెరా సెటప్ గురించి భిన్నమైన రూమర్లు ఉన్నాయి. అవేమిటంటే, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫోన్ లో వెనుక మూడు 50MP కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అయితే, ఈ ఫోన్ 50MP మెయిన్ 10MP టెలిఫోటో మరియు 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వస్తుందని కొని లీక్స్ చెబుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రూమర్లు మరియు లీక్స్ లో ఎన్ని నిజమయ్యే ఛాన్స్ ఉందొ, ఈ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కొత్త అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.
